
విజయ్ ఆంటోని హీరోగా ఆత్మిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఈ సినిమాకు ఆనంద్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి. రాజా – డి.ఆర్. సంజయ్ కుమార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రౌడీల మధ్య నలిగిపోయే సామాన్య ప్రజలను కాపాడటానికి విజయ్ ఎదుర్కొనే పరిస్థితులే విజయ రాఘవన్ సినిమా కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ గా కేజీఎఫ్ గరుడ రామ్ నటిస్తున్నాడు. డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి సినిమాలతో తెలుగులోనూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. అతడు నటిస్తున్న సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. విజయ్ ఆంటోని చివరిగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన “కిల్లర్”లో కనిపించాడు.