
లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 181/6 ఓవర్ నైట్ స్కోర్ తో సోమవారం ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్ లో 105 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే జస్ప్రిత్ బుమ్రా (34 నాటౌట్), మహ్మద్ షమీ (56 నాటౌట్) రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో భారత్ తొలి సెషన్ పూర్తయ్యేసరికి 186/8తో నిలిచింది. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను అద్భుత పోరాటంతో ఆదుకున్నారు షమీ, బుమ్రా. తొమ్మిదో వికెట్ కు 97 పరుగులు జోడించి టీమ్ఇండియాను పటిష్ఠ స్థితికి చేర్చారు. దీంతో లంచ్ విరామ సమయంలో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్ లో సహచర క్రికెటర్లు ఘనస్వాగతం పలికారు. ఈలలు, చప్పట్లతో గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఇక రెండో సెషన్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే ఇన్నింగ్స్ ను భారత్ డిక్లేర్ చేయగా ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది.
రెండో టెస్టులో భారత బౌలర్లు మాయ చేశారు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్ ను బౌలర్లు ఒక్కసారిగా విజయతీరాలకు చేర్చారు. దీంతో ఇంగ్లాండ్ 120 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 33/3, సిరాజ్ 32/4, ఇషాంత్ శర్మ 13/2, షమీ ఒక వికెట్ తీశారు. టీమిండియా 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 5 టెస్టుల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఆట ఐదో రోజు భారత్ విధించిన 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ భారత బౌలర్ల ధాటికి నిలువలేక పోయారు.
అంతకుముందు టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 298/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 391 పరుగులకు ఆలౌటయ్యాక.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరికి ఆతిథ్య జట్టు ముందు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదో రోజు ఆటలోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బుమ్రాను జాస్ బట్లర్, మార్క్ వుడ్ రెచ్చగొట్టగా అతడు తిరిగి గట్టిగా సమాధామిచ్చాడు. ఇదంతా గమనించిన కెప్టెన్ కోహ్లీ అసహనానికి గురయ్యాడు.
WHAT. A. WIN! ? ?
Brilliant from #TeamIndia as they beat England by 1⃣5⃣1⃣ runs at Lord's in the second #ENGvIND Test & take 1-0 lead in the series. ? ?
Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/rTKZs3MC9f
— BCCI (@BCCI) August 16, 2021