
India's Mohammed Shami (R) and teammate Jasprit Bumrah walk from the field at the end of their innings during day two of the first Test cricket match between New Zealand and India at the Basin Reserve in Wellington on February 22, 2020. (Photo by Marty MELVILLE / AFP)
లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా ఆధిక్యం 256 పరుగులకు చేరింది. డ్రింక్స్ బ్రేక్ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్ లో 96 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ షమీ టెస్ట్ లో తన రెండో అర్ధ శతకం (52 బ్యాటింగ్) సాధించాడు. అండగా జస్ప్రీత్ బుమ్రా (29 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు, అజింక్యా రహానే 61 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఎక్కడ ఏకాగ్రత కోల్పోకుండా భారత బౌలర్లు చాలా అణకువగా బ్యాటింగ్ చేస్తున్నారు.
అంతకుముందు పంత్ 22 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా (3) విఫలమయ్యాడు. ఇషాంత్ శర్మ (16) విలువైన పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 200 దాటింది. ఆటకు ఇవాళ చివరి రోజు కావడంతో ఫలితంపై భిన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మ్యాచ్ డ్రా అవ్వొచ్చని, ఒక్కోసారి స్వల్ప టార్గెట్లను ఛేదించలేక జట్లు చతికిలపడిన సందర్భాలు ఉన్నాయని క్రికెట్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడుతున్నారు.