
భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ రసవత్తరంగా మారింది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచ్ లో కవ్వింపు చర్యలకు ఆటగాళ్లు పాల్పడుతున్నారు. రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో అండర్సన్ బుమ్రా ను దూషించడంతో మొదలు, నాల్గవ రోజు ఆటలో కోహ్లీ ని మాటలు జారాడు. దానికి బదులు కోహ్లీ కూడా ఆండర్సన్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 364 పరుగులకి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12×4, 1×6) టాప్ స్కోరర్‌కాగా.. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (5/62) ఐదు వికెట్ల మార్క్‌ని అందుకున్నాడు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకి ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ జో రూట్ (180: 321 బంతుల్లో 18×4) రికార్డు శతకం నమోదు చేయగా.. మహ్మద్ సిరాజ్ (4/94), ఇషాంత్ శర్మ (3/69) ఆకట్టుకున్నారు.
మ్యాచ్‌లో నాలుగోరోజైన ఆదివారం 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 181/6తో నిలిచింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 154 పరుగులుకాగా.. క్రీజులో రిషబ్ పంత్ (14 బ్యాటింగ్: 29 బంతుల్లో), ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్: 10 బంతుల్లో) ఉన్నారు.