
తెలంగాణ మినిస్టర్ కేటీఆర్, కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్కు ఒక లేఖను రాసారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే, కంటోన్మెంట్ పరిధిలో ఇష్టానుసారంగా రోడ్ లను మూసివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర తీవ్ర ఇబ్బందులు లేఖలో వివరించారు. ఇంకా కరోనా కారణం చెప్తూ అక్కడ రోడ్లు మూసేస్తున్నారని, ఈ క్రమంలో ప్రజలు కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ యాక్ట్ సెక్షన్ 258 ప్రకారం ఈ చర్యలు విరుద్ధమని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని స్థానిక మిలటరీ అధికారులకు రోడ్లు మూసివేయకుండా ఆదేశాలివ్వాలని అందులో పేర్కొన్నారు.