
పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుంది అనుకున్న వకీల్ సాబ్ కి కరోనా దెబ్బ పడింది. వకీల్ సాబ్ థియేటర్ లో ఉండగానే కరోనా దెబ్బకు థియేటర్ లు మూతపడ్డాయి. చాలామంది సినిమా ప్రేమికులు నిరాశ చెందారు. ఏప్రిల్ లో మూతపడ్డ సినిమా థియేటర్లు మళ్ళీ నాలుగు నెలల తర్వాత రేపు తిరిగి తెరుచుకోనున్నాయి. జులై 30 శుక్రవారం నాడు రెండు సినిమాలు విడుదలకి సిద్ధంగా వున్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాలపై తమ ఫోకస్ పెట్టారు. ఈ సినిమాల రిపోర్ట్ పై సినిమా పరిశ్రమ అంతా ఎదురుచూస్తుంది. సినిమాల విషయంలో జనాల అభిప్రాయం ఎలా ఉంది? థియేటర్ కు వెళ్లడానికి ఎంత వరకు రెడీగా ఉన్నారు? కలెక్షన్ కెపాసిటీ ఎంత? అనే అన్ని అంశాలపై ఓ క్లారిటీ రానుంది. ఆ తర్వాతనే తమ సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత ఈ శుక్రవారం రాబోతున్న రెండు సినిమాల్లో ఒకటి సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’. మరొకటి తేజ సజ్జా హీరోగా వస్తున్న ‘ఇష్క్’. ఇవి రెండూ చిన్న సినిమాలే అయినా, కథ పరంగా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు అని టాక్. సెకండ్ వేవ్ లో మూతపడిన థియేటర్లను తెరిపించి, జనాలను రప్పించడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా.. థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న వేళ ఆషామాషీ కాదు. అందుకే.. ఈ రెండు చిత్రాల మేకర్స్ ప్రచారమైతే భారీగానే చేస్తున్నారు. జనాల మూడ్ ఎలా ఉంది? అన్నది ఒక టెన్షన్ అయితే.. ఏపీలో సినిమా థియేటర్లకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం మరో ఇబ్బంది. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీ ఉంది. థియేటర్లు కూడా పూర్తిగా తెరుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. థియేటర్లలో పార్కింగ్ చార్జీలు సైతం వసూలు ఏసుకునేందుకు థియేటర్లకు అవకాశం ఇస్తూ జీవోను సైతం ఇచ్చింది సర్కారు. కాబట్టి.. ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేదు. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.
ఏపీలోని సినిమా థియేటర్లలో ఇప్పటి వరకు 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే అమల్లో ఉంది. అంతేకాదు.. నైట్ షోలు కూడా లేవు. ఇక, వకీల్ సాబ్ సమయంలో హడావిడిగా టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు.. ఆ తర్వాత ఏమీ మాట్లాడలేదు. ఇలాంటి కారణాలతో సీ సెంటర్లలో థియేటర్లు తెరుకోవట్లేదు. బీ సెంటర్లు కూడా చాలా వరకు డౌటే. అసలే.. 50 శాతం ఆక్యుపెన్సీ, పైగా నైట్ షోలు లేకపోవడం వంటి కారణాలతో థియేటర్లు ఓపెన్ చేసుకొని ఏం చేయాలి? అనే ఆలోచనలో ఉన్నారు ఎగ్జిబిటర్లు. ఏ సెంటర్లు అన్నీ తెరుచుకుంటాయా? అన్నది చూడాల్సిన విషయం. కేవలం మల్టీ ఫ్లెక్స్ లు మాత్రమే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మరి, ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి మరీ విడుదలవుతున్న రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయోని ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది