
లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనలను నిరసిస్తూ మహారాష్ట్రలోని అధికార పక్షం ‘మహావికాస్ అఘాదీ’ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్) నేతృత్వంలో సోమవారం జరిగిన బంద్ చేసిన విషయం తెలిసిందే. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ బంద్ లో శివసేన కార్యకర్తలు రెచ్చిపోయారు.
శివసేన కార్యకర్తలు థానేలో రోడ్లపైకి వచ్చిన ఆటో డ్రైవర్లపై కర్రలతో దాడి చేశారు. ఓ లీడరైతే ఏకంగా ఆటో డ్రైవర్ చెంప ఛెల్లుమనిపించాడు. ఆటోలను ఆపాలని కొందరు కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. శివసేన కార్యకర్తల దాడులతో ఆటో డ్రైవర్లు భయపడ్డారు. ఈ బంద్ నేపథ్యంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ విధ్వంసంపై బీజేపీ విమర్శిస్తుంది.