
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు దర్శకుడు మోహన్ రాజా తెలిపారు. ఈ సినిమా కోసం తమన్ ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశారట. అవి మెగా అభిమానుల్ని అలరించనున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు మోహన్ రాజా, తమన్ ను కలిసిన చిరు.. వాళ్లతో కలిసి ఫొటో దిగారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లూసిఫర్ రీమేక్ కోసం డీఓపీగా నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్ గా సురేశ్ రాజన్, స్టంట్స్ కోసం సిల్వ పని చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో హిందీ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ మెగాస్టార్ కి సిస్టర్ గా నటించబోతుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. మోహన్ రాజా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. హీరోయిన్ గా నయనతారను ఫైనల్ చేశారట.
With the blessings of parents and well wishers starting next journey, this time a Mega one ?
Getting set with an amazing team
Dop #Niravshah
Art dir @sureshsrajan
Stunt @silvastunt #Chiru153 #megastar153#shootstarts pic.twitter.com/puSMuJP4Ju— Mohan Raja (@jayam_mohanraja) August 13, 2021