
మెగా కోడలు ఉపాసనకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరే లెవెల్. ఓవైపు అపోలో ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఆసక్తికరమైన పోస్టులతో అలరిస్తుంటారు. రామ్ చరణ్, ఇతర మెగా కుటుంబ సభ్యుల ఫొటోలను, ముఖ్యమైన సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. అలా ఉపాసన సోషల్ మీడియాలో మంచి ఆదరణను దక్కించుకుంటూ.. మెగా కోడలిగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఉపాసన ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో తన అత్తమామలు సురేఖ, చిరంజీవితో పాటు తన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని కూడా ఉన్నారు. తనకు అత్యంత విలువైన ఫొటో ఇదేనని ఉపాసన తెలిపారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా.. మిగతా వారంతా కూడా నిల్చుని ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఉపాసన తన అత్తమామలు, భర్త మీదున్న ప్రేమను చాటుతుంటుంది. మెగా ఫ్యామిలీ మీదున్న విధేయతను చాటుతుంది. ఇక మెట్టినింటినికి ఉపాసన ఎంత ప్రాధాన్యం ఇస్తుంటుందో.. పుట్టినింటికి అంతే ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఉపాసన షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
My most precious pic ? pic.twitter.com/RjGCvbKhfD
— Upasana Konidela (@upasanakonidela) September 25, 2021