
‘మెగా’ ఫ్యామిలీ నటుడు నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో బుధవారం అర్ధరాత్రి పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారట. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే, చైతన్య కూడా అపార్ట్ మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదుల విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఈ గొడవలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, నిహారిక యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ ఆమె యాక్టు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం గత ఏడాదిలో జరిగింది.