
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి ‘ఆచార్య’తోపాటు మరో మూడు చిత్రాల్లో నటించేందుకు గతంలో అంగీకరించారు. అందులో ‘వేదాళం’ రీమేక్ ఒకటి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్ర కీలకంగా మారనుంది. ఈ పాత్ర కోసం హీరోయిన్లు సాయిపల్లవి, కీర్తి సురేష్ తోపాటు పలువురు కథానాయికల్ని పరిశీలించారు. ఎట్టకేలకు ఆ పాత్రలో నటించేందుకు కీర్తి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరు కొన్ని సన్నివేశాల్లో గుండుతో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఇదివరకే మేకప్ టెస్ట్ కూడా చేశారు.
తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. అక్టోబర్ మాసం నుంచి .. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చాలా వేగంగా కంప్లీట్ చేయాలని పక్క షెడ్యూల్ తో చిత్రం యూనిట్ ముందుకు వెళ్తుంది.