
తెలంగాణ రాష్ట్రము ఏర్పడిందే మన నీళ్ళు , మన నిధులు, మన నియామకాలు నినాదంతో.. కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు ఇంటింటికీ నల్ల ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్ట్.. కాగా జిహెచ్ఎంసి పరిధిలోని కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో గత 10 రోజులుగా మిషన్ భగీరథ కి సంబంధించిన నీళ్లు మురికి గా వస్తున్నాయి. ఈ నియోజక వర్గ ప్రజలు తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో చింతల్, ఐడిపిఎల్ ఏరియా,అదర్శ నగర్,గురుమూర్తి నగర్ తో పాటు కూకట్ పల్లి నియోజకవర్గం లోని బాలానగర్, ఫీరోజిగూడ తదితర ప్రాంతాల్లో త్రాగు నీరు మురికి గా రావడంతో అక్కడి ప్రజలు తాగడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అర్ధం కాక జనాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.