
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల తొమ్మిదో తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు బ్లాస్టర్ టీజర్ విడుదలముహుర్తం ఖరారు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను కూడా రెడీ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఓ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Block your calendars and lock your plans ??!!
Lets Begin the SuperStar Birthday Extravaganza ?#SuperStarBirthdayBLASTER on AUG 9th @ 9:09 AM ??
? https://t.co/4nQQKHABgC#SarkaruVaariPaata ? @urstrulyMahesh pic.twitter.com/GZ1wC98SdW
— BARaju's Team (@baraju_SuperHit) August 7, 2021
ఈ సినిమాలో హీరోయిన్ గా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. సినిమాను జీఎంబీ ప్రొడక్షన్స్, 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ తన బర్త్ డే సందర్భంగా.. తన అభిమానులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని రిక్వెస్ట్ చేశారు.