
పెట్రోల్ కు వంట గ్యాస్ కూడా తోడైంది. తాజాగా వంట గ్యాస్ కూడా వచ్చే వారం మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగిన దృష్ట్యా సిలిండర్ పై రూ.100 మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి ధర మళ్లీ పెంచక తప్పదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ నెల 6వ తేదీన సిలిండర్‌పై రూ.15 పెరిగింది. జూలై నుంచి విడతల వారీగా మొత్తం రూ.90 పెరిగింది.