
ఆయుర్వేదం ప్రకారం మన శరీరానికి మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడం ఎంత ముఖ్యమో.. మనం తాగే నీరు కూడా జీర్ణమవ్వాలి. మనకు సోకే వ్యాధుల్లో ఎక్కువ శాతం నీటి ద్వారానే వస్తుంటాయి. అందువల్ల మనం తాగేనీరు కలుషితం కాకుండా చూసుకోవడం ముఖ్యం.
ఈ మధ్యకాలంలో ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ కొని అవే మంచివి అని లీటర్ నాలుగు రూపాయల నుండి ఐదు రూపాయలు పెట్టి కొంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వల్ల మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి.దీని వలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగి పోతున్నాయి. అందువల్ల మినరల్ వాటర్ తాగే కంటే మట్టిపాత్రల్లో నిల్వ చేసుకున్న నీరు తాగడం చాలా ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
1) మట్టికుండ నీటిని తాజాగా ఉంచడమే కాకుండా గంటల తరబడి చల్లగా ఉంచుతుంది. ఎందుకంటే మట్టి సహజసిద్ధమైన కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది.
2) మట్టికుండలోని నీరును తాగడం వల్ల శరీరంలో అసిడిటీ తగ్గుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది
3) మట్టికుండలోని నీరు జీవక్రియను మెరుగుపరుచుతుంది
4) మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అలాగే అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ దాగుంటుంది. ఇలాంటి మట్టితో తయారుచేసిన కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఈ నీటిని తాగడం వల్ల మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తపడచ్చు.
5) మట్టి కుండలో పోసిన నీళ్లు వంద శాతం ప్యూరిఫైడ్ చేసిన నీటితో సమామని నిపుణులు స్వయంగా రిసెర్చ్ చేసి మరి చెప్పారు. ప్యూరిఫైడ్ నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరవుతాయి. నీటిలోని మళినాలు కుండ పీల్చుకుని, ప్యూర్ వాటర్గా మారుస్తుంది. మట్టి కుండలో అంతటి మహిమ ఉంది కాబట్టే మన పెద్దోళ్లు మట్టి కుండల్లో నీరు, మజ్జిగ ఉచితంగా పంపిణీ చేసేవాళ్లు.
6) మట్టికుండలోని నీటితో ముఖం కడిగితే ఎండ నుండి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాదు.. మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది
7) ముఖ్యంగా మట్టికుండలోని నీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఈ రోజుల్లో చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారు. నిత్యం బాటిళ్లలో నీళ్లు తాగడం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అందుకే మట్టి కుండలోని నీళ్లను తాగాలని సూచిస్తున్నారు. కుండలోని వాటర్ ప్యూరిఫై అవ్వడం మాత్రమే కాకుండా, శరీరానికి ఎలాంటి హాని చేయదట.
8) మట్టి పాత్రలు, మట్టి కుండలలో నీటిని నిల్వ ఉంచడమే కాకుండా వంటకాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. టీ కప్పు నుంచి వాటర్ బాటిళ్లు, వంట పాత్రలు అందుబాటుల ఉంటున్నాయి. మట్టి వస్తువుల పై రంగు రంగుల చిత్రాలు చిత్రీకరించి పలు రకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారు చేస్తూవిక్రయిస్తున్నారు.