
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు అప్పజెప్పారు. ఈ మూవీలో ‘భీమ్’ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ఇకపై ’ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్, అప్ డేట్ బాధ్యతలను చూసుకోనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది.
ప్రమోషన్, అప్ డేట్స్ కోసం రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఈరోజు (సోమవారం) నుంచి కొన్ని రోజుల పాటు ఎన్టీఆర్ స్వాధీనంలో ఉంటుంది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ బాధ్యత ఎన్టీఆర్ కు అప్పగించడపై యంగ్ టైగర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.