
జిహెచ్ఎంసి పరిధిలో వర్షా కాలం వచ్చిందంటే చాలు పలు కాలనీ లు , రోడ్ లు జల మయమవుతాయి. రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడం వాళ్ళ కాలనీలు, రోడ్స్ నీళ్లల్లో వున్నాయి. కాగా, కొందరు వాటర్ లో వున్న కాలనీల పాత వీడియోలను స్కోరిల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో భారీ వరదలు వచ్చాయని, ఇళ్లు కూలిపోతున్నాయంటూ పాత వీడియోలను కొత్త వీడియోలుగా చూపుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వారికి రాచకొండ సీపీ మహేష్ భగవత్ వార్నింగ్ ఇచ్చారు. వీడియోలను వైరల్ చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాగా, వర్షాల కారణంగా ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 100కు ఫోన్ చేసి చెప్పాలని, సంబంధిత సిబ్బంది వెంటనే వచ్చిన సాయం చేస్తారని ఆయన వివరించారు. సహాయక బృందాలు, పోలీసులకు సహకరించాలని అన్నారు.