
కాకరకాయ జాతికి చెందినదే ఆ కాకరకాయ. దీనిని అడవి కాకరకాయ, లేదా బోడ కాకరకాయలు అంటారు. కాకరకాయల మాదిరిగా పొడుగ్గా కాకుండా రౌండ్ గా ఉండి, చిన్న చిన్న బొడిపి లుంటాయి. అయితే దీని ఖరీదు కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇవి సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా దొరుకుతాయి. ఈ వర్షాకాలం సీజన్ లో మాత్రమే కేజీ 200 నుండి 240 రూపాయలు దొరికే అవకాశం ఉంటుంది.
ఆ కాకరకాయను ఆహారంలో తీసుకోవడం వలన మధుమేహం , గుండె జబ్బులతో పాటు అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అని చెబుతుంటారు.
ఆకాకరకాయలో చాలా తక్కువ సంఖ్యలో కేలరీలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. ఇది శరీరంలో ఏర్పడిన వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.
మధుమేహంతో బాధపడే వారి పాలిట ఆకాకరకాయ గొప్ప వరం. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే ఇన్సులిన్ ఉత్పత్తి ని పెంచుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తరచుగా దీనిని ఆహారంలో తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
దీనిలో ఉండే యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలోని కాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నివారిస్తాయి. శరీరంలో ఏర్పడ్డ కణితులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలో ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యాన్నిస్తాయి. ఇందులో ఉంటే విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఇందులో ఉండే పొలేట్ అనే పోషకాలు శరీరంలో కొత్త కణాల వృద్ధి మరియు గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పతుంది. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలు ఆకాకరకాయ ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో ఉండే ఫూటో న్యూట్రియంట్స్ కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.
మూత్రపిండాల సమస్యలు ఉన్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది. ఆకాకరకాయ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ప్రస్తుత కరోనా సమయంలో చాలా ఉపయోగపడుతుంది కూడా, వీటిని తినడం ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.
సేకరణ: పెండ్యాల రామ్