
‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి మంచి హిట్ సినిమా తర్వాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు కి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తుంది. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సినిమాలోని హైలైట్ సన్నివేశాలు దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్టు గా తెలుస్తుంది. బుల్లెట్ పై సూపర్ స్టార్ మహేష్ హాలీవుడ్ హీరోలాగా కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే ఛేజింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇదేంటో తెలియాలి అంటే ‘సర్కారు వారి పాట’ విడుదల వరకు ఆగక తప్పదు.ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.