
మాజీ మంత్రి పెద్దిరెడ్డి బిజెపి కి రాజీనామా చేసిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అతి త్వరలో తెరాస లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ పై విమర్శలు చేయదలచుకోలేదు అంటూనే బిజెపి నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి పార్టీలో పరిస్థితులు నచ్చలేదని, ఈటెల రాజేందర్ ను పార్టీ లో చేర్చుకునే విషయంలో తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తనను తెరాస లో కి ఆహ్వానించారని, కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ప్రకటించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ… వారి కోసం పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.