
మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ బీజేపీ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపరి మీడియాతో మాట్లాడిన ఆయన సీనియర్ నాయకుడిని అయిన తనకు బీజేపీలో సముచిత స్థానం దక్కలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం నేను చేసిన తప్పా? దళిత సాధికారత కోసమే కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారు. అవినీతిపరుడైన ఈటెలను పార్టీలో చేర్చుకోవడం నన్ను బాధించింది. ఈటల చేరికపై నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. దళిత భూములను ఈటల ఆక్రమించారు.. హుజురాబాద్లో పోటీ చేసేందుకు ఆయన అనర్హుడు. హుజురాబాద్ ప్రజలు ఈటెల
రాజేందర్ ను బహిష్కరించాలి’’ అని కోరారు.