
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబో లో మరో మాంచి సినిమా రాబోతున్నట్టు ఫిలిం నగర్ లో టాక్ వినపడుతుంది. వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్ బద్రి, కెమరామెన్ గంగ తో రాంబాబు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టేందుకు ఈ జంట రెడీ అయినట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ కోసం పూరి జగన్నాద్ ఓ మంచి కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ పూరి, పవన్ కళ్యాణ్‌ని కలిసి కథని వినిపించి ఓకే చేయించుకున్నాడని టాక్. కథ చాలా డిఫరెంట్ గా ఉండటంతో, పవన్ వెంటనే రెడీ అన్నట్టు సమాచారం. ఈ సినిమా ఠాగూర్ మధు నిర్మాణ సారధ్యంలో రానున్నట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హరీశ్ శంకర్ సినిమాను పూర్తిచేసిన తరువాత, పవన్ చేసే ప్రాజెక్టు ఇదేనని అంటున్నారు. ఓ విధంగా ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి, పూరి అభిమానులకి పండగే అని చెప్పాలి