
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ అంటూ డిస్కౌంట్ సేల్స్ జరపనుంది. ఈ జులై 25 నుండి జులై 29 వరకు ఐదు రోజులపాటు ఈ డిస్కౌంట్ సేల్ ని పెట్టనుంది. ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఆక్సిసిరీస్ పై డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇందులో ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్‌మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌తో సహా పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. దీనిలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ‘మినీ ఫ్లాష్ సేల్’ కూడా నిర్వహించనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డు కలిగిన వినియోగదారులకు 10 శాతం తగ్గింపును అందిస్తుంది.ఈ జూలై 24 అర్ధరాత్రి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అందుబాటులోఉంటుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల పై 80 శాతం వరకు తగ్గింపు రేట్లను అందించనుంది.ఇంకా ల్యాప్‌టాప్‌లు, హెడ్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వైర్లెస్ రౌటర్లు ఇతరఎలక్ట్రానిక్స్పై తగ్గింపును లభించనుంది. దీనికి అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో-కాస్ట్ ఈఎంఐ కూడా లభ్యం. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఫ్లిప్‌కార్ట్ తన డిస్కౌంట్ అమ్మకాలను మొదలు పెట్టడం విశేషం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ కేవలం ఒక రూపాయితో ప్రీ-బుకింగ్ చేసుకునే అవకాశాన్నిస్తోంది. సేల్ ప్రారంభం తరువాత మిగిలిన ధరను చెల్లించి సంబంధిత వస్తువును కొనుగోలు చేయవచ్చు.
రానున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 ,సాయంత్రం 4 గంటలకు మినీ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనుంది. అంటే పలు ప్రొడక్ట్స్ నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. దీంతోపాటు ఎంపిక చేసిన ఉత్పత్తులపై టిక్ టాక్ డీల్స్ ఫ్లాష్ సేల్‌ను కూడా ప్రకటించింది. ఇందులో ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు అతి తక్కువ ధరలకే పలు ఉత్పత్తులు లభించనున్నాయి.
ఐఫోన్ 12 రూ. 67,999 (ఎంఆర్పి రూ .79,999)
ఐఫోన్ ఎస్ఇ రూ. 28,999 (ఎంఆర్పి రూ .39,900)
మోటరోలా రేజర్ రూ. 54,999 (ఎంఆర్పి రూ. 1,49,999)
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 రూ. 9,999
రియల్మీ సి 25 రూ. 9,999 (ఎంఆర్పి రూ .10,999)
పోకో ఎక్స్ 3 రూ. 15,999 (ఎంఆర్పి రూ .19,999)
ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 2021 రూ. 6,499 (ఎంఆర్పి రూ .7,999