
ఈ ఫోన్ల ట్యాపింగ్ ద్వారా నే అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ను ఓటుకు నోటు కేసులో ఇరికించింది. ఆ ఉదంతం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అప్పట్లో అది వివాదాస్పదం అయింది.
కాగా, ఇప్పుడు కూడా తెరాస ప్రభుత్వం ఆ ఫోన్ల ట్యాపింగ్ ను కొనసాగిస్తోందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీనికి సహకరించిన అధికారులు కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని,తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. పోలీసులు ఖాసీం రిజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రికి ఐజీ ప్రభాకర్ రావు పై ఫిర్యాదు చేస్తానన్నారు .
కాంగ్రెస్ పార్టీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల తోనే కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం పై రేవంత్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. మరి చంద్రబాబు విషయంలో జరిగినట్లు ఇప్పటికీ జరుగుతుందా లేదా? అన్నది నిగ్గు తేలాలని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.