
తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ గా బాగా పాపులర్ అయిన పదం పప్పు. ఆంధ్రాలో లోకేశ్, కేంద్రంలో రాహుల్ గాంధీలను సందర్భం వచ్చిన ప్రతిసారీ అపోజిషన్ పార్టీల నేతలు పప్పు .. పప్పూ అని ఏడిపిస్తుంటారు. అయితే, ఇకపై పప్పు అనే పదాన్ని అసెంబ్లీలో ఉపయోగించడానికి వీల్లేదని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. పప్పు, వెంటిలేటర్, మిస్టర్ బంటాధార్, చోట్ వంటి పదాలను అసెంబ్లీలో ఉపయోగించవద్దని మధ్యప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ క్రమంలో సభలో ఏయే పదాలను పలకకూడదో వాటి జాబితాను అసెంబ్లీ స్పీకర్ విడుదల చేశారు. 1954 నుంచి ఇప్పటి వరకు నిషేధిస్తూ వస్తున్న పదాలు, వాక్యాల సంఖ్య 1,161కి చేరింది. నిషేధిత పదాలు, వాక్యాలకు సంబంధించి 38 పేజీల బుక్లెట్ను ఎమ్మెల్యేలకు స్పీకర్ అందించారు.