
దర్శకుడు, నటుడు, డాన్స్ మాస్టర్ ప్రభు దేవా నటిస్తున్న తమిళ చిత్రం ‘పొయికాల్ కుదిరై’. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఒక చేత్తో పాపను ఎత్తుకుని, మరో చేత్తో ఇనుప ఆయుధాన్ని పట్టుకుని ఉన్న ప్రభు దేవా ఒంటి కాలుతో కనిపించడం ఈ పోస్టర్ లో ఉంది. సీరియస్ పోజ్ లో ఉన్న ప్రభుదేవా.. శత్రువుల బారి నుంచా ఆ పాపను కాపాడే ప్రయత్నంలో ఉన్నాడనే విషయం ఈ పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. విభిన్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు సంతోష్ జయకుమార్. రైజా విల్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, సముద్రఖని నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘పొయికాల్ కుదిరై’ ను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.