
వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు. వకీల్ సాబ్ హిట్ తో మంచి ఊపు మీద వున్న పవన్, అభిమానులకు మరోక మంచి మల్టీస్టారర్ రెడీ అవబోతుంది. పవన్ కళ్యాణ్,రానా కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. మలయాళం సినిమా అయ్యప్పమమ్ కోషియుమ్ ను తెలుగు లో సాగర్ చంద్ర అనే యువ దర్శకుడు రీమేక్ చేస్తున్నారు, ఎప్పుడో షూటింగ్ అయిపోవాల్సింది కానీ కరోనా కారణం గా ఆగిపోయింది .. ఇప్పుడు కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టడం తో మల్లి షూటింగ్ ని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ స్పాట్ లో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటో సోషల్చ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీస్ గెటప్ లో పవన్ కల్యాణ్ అదరగొడుతున్నారుు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. అలాగే దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది.