
దొంగలను పట్టాల్సిన పోలీసులే తన ఇంట్లో దొంగతనం చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. కూకట్‌పల్లిలోని తన ఇంట్లో విలువైన పత్రాలను, కొన్ని వస్తువులను కూడా బోయినపల్లి పోలీసులు తీసుకెళ్లారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో బోయినపల్లి పోలీసులతో పాటు కొంతమంది కలిసి మొత్తం పదిమంది ఇంట్లోకి చొరబొడ్డారని, ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు, తండ్రి భూమా నాగిరెడ్డికి చెందిన వస్తువులను కూడా ఎత్తుకు పోయారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను, ఫొటోలను, వీడియోలను కూడా అఖిలప్రియ పోలీసులకు ఇచ్చారని సమాచారం. బోయినపల్లి ప్రదీప్‌రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారంలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త తమ్ముడులు కూడా అరెస్టైన విషయం తెలిసిందే.