
పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తార జువ్వలా పై పై కి పెరుగుతూనే వుంది, మళ్ళి పెట్రోల్ ధరలు పెరిగాయి.
దేశీయ ఆయిల్ కంపెనీలు రోజువారీ రివ్యూ లో భాగంగా లీటర్ పెట్రోల్ పై 30 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రల్ సెంచరి దాటి రూ. 101.84 కి చేరింది. అయితే డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 89.87 గా ఉన్నది. ఇక ముంబైలో పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45గా ఉన్నది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 105.83, డీజిల్ రూ. 97.96 గా ఉన్నది.