
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకి పండగ పూనకాలు తెప్పించే గ్లింప్స్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసింది ఈ సినిమా టీం. ‘భీమ్లా నాయక్’ టైటిల్ తో పవర్ స్టార్ మాస్ ఎంట్రీ తో అదిరిపోయేలా డిజైన్ చేశారు. అదిరిపోయే మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్ లుంగీలో ఆవేశంగా అరుస్తూ ఎంట్రీ ఇచ్చిన విధానం అద్భుతంగా అనిపించింది. అభిమానుల్లో ఉత్సహాన్ని రెట్టింపు చేస్తూ పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’ ఎంట్రీ అదిరిపోయింది.
ఇక వీడియోని చూసిన పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ “భీమ్లా నాయక్” అనే పెట్టారు. మొదటి నుంచి ఈ టైటిల్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అందుకే అదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అన్నట్టు వీడియో చివర్లో ‘ఏంటీ చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా.. అక్కర్లేదు బండెక్కు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ కూడా బాగా పేలింది. ఈ వీడియోలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే పవన్ మేనరిజాన్ని, బాడీ లాంగ్వేజ్ ను దర్శకుడు సాగర్ చంద్ర చాలా బాగా పట్టుకున్నాడు. ఏది ఏమైనా ఈ ఫస్ట్ గ్లింప్స్ తో మాస్ కే స్పెషల్ టచ్ ఇచ్చారు.
కాగా ఈ సినిమాను జనవరి 12, 2021కి రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా పాటలను సెప్టెంబర్ 2 నుంచి విడుదల చేస్తామని చెప్పారు. ఈ సినిమాకి యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ కూడా పని చేస్తున్నాడు.