
ఫోన్ హాకింగ్ గురించి విన్నాం మనం. ఇజాయిల్ కి చెందిన ‘పెగాసస్’ స్పైవేర్ గురించి మన దేశ పార్లమెంట్ ని షేక్ చేస్తుంది. ఈ విషయం మన దేశాన్ని సైతం కుదిపేస్తున్నది. ఇందులో భాగంగా లోక్ సభ, రాజ్యసభల్లో ఇతర విషయాలను పక్కన పెట్టి ఈ స్పైవేర్ పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజాగా, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ పలుమార్లు హ్యాకింగ్ కు గురైనట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చానని, అయినప్పటికీ తన ఫోన్ హ్యాకింగ్ కు గురవుతూనే ఉందని చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన ఫోన్ ఈ నెల 14న హ్యాకింగ్ కు గురైంది. కాంగ్రెస్ కీలక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్న సమయంలో ఫోన్ హ్యాక్ అయింది. దీనిపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి