
వకీల్ సాబ్ తర్వాత పవర్ స్టార్ నటిస్తున్న చిత్రం అయ్యప్పన్ కోషియమ్ అనే మలయాళం మూవీ, పవన్ కళ్యాణ్ తో పాటు హీరో దగ్గుపాటి రానా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. మలయాళం లో హిట్ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు లో సాగర్ చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతోంది. కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆపేశారు. మరల నిన్న ఏ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. కాగా, ఈ సినిమా సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ మేకింగ్ వీడియో విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఈ వీడియోలో అధ్యాంతం పవన్ కళ్యాణ్ నే కనిపించారు. అలాగే రానా కూడా ఈ మేకింగ్ వీడియో మెరిశారు. ఇక సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో పవన్ కళ్యాణ్, అతనితో ఢీ కొట్టే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా మెరియనున్నారు . తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తాజా మేకింగ్ వీడియోలో తెలిపింది.