
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దిల్ రాజు ఒక బ్రాండ్. ఆయన ఎంచుకునే కథలు, ఆయన సినిమా నిర్మించే విధానం ఇవన్నీ ఆయన్ని టాప్ ప్రొడ్యూసర్ గ నిలబెట్టాయి. ఆయన తో సినిమా చేయడానికి హీరో లు లైన్ లు కడతారు. తనకంటూ ప్రత్యక స్థానం ఏర్పరుచుకున్నారు దిల్ రాజు. బడా హీరో లు ఆల్మోస్ట్ అందరు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసినవారే. అందుకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిల్ రాజుకి ఎప్పుడు అంటే అప్పుడు వెంటనే డేట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. పవన్ తో సినిమా కోసం చాలా మంది నిర్మాతలు వెంట పడుతున్నారు. అయినా, పవన్ మాత్రం ఒక్క దిల్ రాజు తో సినిమాకే ఓటేశాడు. దిల్ రాజు తో వకీల్ సాబ్ చేసిన పవన్, ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్లు డేట్లు ఇవ్వగానే పవన్ కు అనుగుణంగా దిల్ రాజు షూటింగ్ ప్లాన్ చేశాడు. అందులో పవన్ కు తగిన విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయించారు. వకీల్‌సాబ్ సినిమాకి పవన్ రెమ్యూనరేషన్ 65 కోట్లు భారీగా ముట్టచెప్పాడు. ఇంత చేసి సినిమా రిలీజ్ చేసినా.. వకీల్ సాబ్ సినిమా స్పెషల్ షో లు క్యాన్సిల్ కావడం, రేట్లు మారడం వంటి వాటి వల్ల దిల్ రాజుకు నష్టం వచ్చింది. అయినా దిల్ రాజు ఈ రోజు వరకూ ఆ నష్టాల గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయంలోనే పవన్ కి దిల్ రాజు బాగా నచ్చాడట. తనకు రావాల్సిన మేరకు రెవెన్యూ రాకపోయినా.. దాని గురించి రాజు, పవన్ దగ్గర ఎప్పుడూ ప్రస్తావించలేదట. అందుకే, స్వయంగా పవనే దిల్ రాజుకి ఫోన్ చేసి మళ్లీ మరో సినిమా చేద్దామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందుకే ప్రస్తుతం దిల్ రాజు మంచి కథ, డైరక్టర్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.