
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పింది. పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన నెలసరి వేతనాన్ని రూ. 15వేల నుంచి 28,719కి పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనాలు ఈ జూలై 1 వ నుండే అమల్లోకి రానున్నాయి. మరోవైపు ప్రొబేషన్ కాలాన్ని మూడు నుంచి నాలుగేళ్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.