
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నల్లగొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేయబోతున్నారు. షర్మిల ప్రత్యేక బస్సులో ఉదయం 10 గంటలకు చేరుకుని అక్కడి సమస్యలపై విద్యార్థులతో చర్చించనున్నారు. తర్వాత క్లాక్ టవర్ కూడలిలో నిరుద్యోగులకు అండగా దీక్ష చేయనున్నారు. ఇప్పటికే షర్మిల ట్వీటర్ వేదికగా కేసీఆర్ పై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టారు.
దొర మాటిచ్చి నాలుగేళ్లయినా బీసీ పాలసీ అమలు పత్తాలేదంటూ షర్మిల సీఎం కేసీఆర్ ను విమర్శించారు. బీసీలంటే మీటింగ్‌లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునేవారు,, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప అధికారంలో పాలుపంచుకునే వారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు, అభివృద్ధికి నోచుకునేవారు కారు.. అంటూ ట్వీట్ చేశారు.
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా నరాల సత్యనారాయణ, వరంగల్‌కు ఊరటి శ్రీనివాస్, మల్కాజ్‌గిరికి ఎం.ఫ్రాన్సిస్ విజయ్‌కుమార్, రాష్ట్ర యూత్ కో-ఆర్డినేటర్‌గా లొడంగి గంగాధర్ నియమితులయ్యారు. వైఎస్సార్టీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా పేరాల యాదగిరి నియమితులయ్యారు.