
నేడు సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు మోత్కుపల్లి నరసింహులు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేణు ఉన్నారు మోత్కుపల్లి నరసింహులు. ఆ తర్వాత బషీర్బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు మోత్కుపల్లి. అనంతరం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో అధికారికంగా చేరనున్నారు. అంతేకాదు మోత్కుపల్లి నర్సింహులు కు ఓ కీలక పదవి కూడా ఇచ్చే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇప్పటికే కేసీఆర్ నుంచి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది.