
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. నిరుద్యోగులకు అండగా నిలిచే నిమిత్తం ప్రతి మంగళవారం ఆమె నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా దీక్షకు దిగారు. కరీంనగర్ హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో దీక్ష చేపట్టారు. సిరిసేడు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. షర్మిల దీక్ష సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇదిలా ఉండగా, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని షర్మిల గతంలోనే ప్రకటించారు. ఈ ఉపఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమేననే ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.
ప్రతీ మంగళవారం నిరుద్యోగల కోసం నిరాహార దీక్ష ఐదో వారం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లందుకుంట మండలం,
సిరిసేడు గ్రామం.
‘జోహార్ మహ్మద్ షబ్బీర్ ‘ pic.twitter.com/nuXC8E3t8c— YS Sharmila (@realyssharmila) August 10, 2021