
ప్రాచీన కాలపు అలవాట్లను ఇన్ని రోజులు మూఢనమ్మకాలు గా అనుకున్నారు అందరూ. కానీ పాత కాల నానుడి ఒకటి వుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళి పాతకాల అలవాట్లకు మారుతున్నాం మనం. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నా!
నిమ్మకాయ, తేనె గురించి తెలియని వారు ఉండరు, ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం, తేనె కలిపి త్రాగడం వలన అనేక లాభాలు చేకూరుతాయి. ఆయుర్వేద అధ్యయనాల ప్రకారం విటమిన్ ‘సి’ మన శరీరానికి కావలసిన ఐరన్ ని గ్రహించడానికి దోహద పడుతుంది.
తేనేని గోరు వెచ్చని నీటితో తీసుకుంటే మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది. కావున నిమ్మరసం,తేనె కలిపి గోరువెచ్చని నీళ్లతో మనం కనుక తీసుకుంటే శరీరానికి అందాల్సిన విటమిన్ ‘సి’ తో పాటు అనేక మైక్రో న్యూట్రియెంట్స్ ను అందించడమే కాకుండా అధిక బరువును తగ్గిస్తుంది. తేనే (honey) మన రక్త పరిమాణానికి దగరలో ఉండడం వలన శరీరానికి మేలు చేస్తుంది. దగ్గు,జలుబు తో బాధపడుతున్నప్పుడు దగ్గు మందు (cough syrup) కి బదులు ఒక చెంచా తేనే తాగడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది.
స్త్రీలు నెలసరి సమయంలో రక్తహీనతతో బాధపడేటప్పుడు నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగడం వలన రక్తహీనత అధిగమించవచ్చు.