
విక్టరీ వెంకీ హీరో గా ‘నారప్ప’ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. వెంకటేష్,ప్రియమణి ల నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాని అన్ని వర్గాల వారు మెచ్చుకునేలా తీశారు. కుటుంభం, స్థిరాస్తి ని కాపాడుకో వాలి అని ఆరాటపడే వ్యక్తిగా ‘ నారప్ప’ పాత్రలో వెంకటేష్ జీవించేసాడు. ఆతని నటనకి అందరు ముగ్దులయ్యి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. ‘నారప్ప’ సినిమాను చూశాను .. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. తెరపై నాకు ‘నారప్ప’ తప్ప ఎక్కడా వెంకటేశ్ కనిపించలేదు. ఆయన ఆ పాత్రను లోతుగా అర్థం చేసుకున్న తీరు .. సన్నివేశాలను పండించిన విధానం గొప్పగా ఉన్నాయి. వెంకటేశ్ కెరియర్లో గర్వంగా చెప్పుకునే సినిమా ఇది” అని అన్నారు. చిరంజీవి అభినందనల పట్ల వెంకటేశ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. “మీ ప్రతి మాట నాకు ఎంతో ఆనందాన్నీ .. సంతృప్తిని కలిగించాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు. ఇక ఇదే విధంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, ఈ సినిమాలో వెంకటేశ్ నటనను ప్రస్తావిస్తూ ప్రశంసలను అందజేస్తున్నారు.