
మన పక్కింటి కుర్రాడులా అనిపించే హీరోలలో నతురల్ స్టార్ నాని ఒకడు. తాను చేసే సినిమాలన్నీ ఇంటిల్లి పాది కలిసి చూసేలా వుంటాయి. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీ గ వున్నాడు. టక్ జగదీష్, శ్యా సింగరాయ సినిమాలతో బిజీ గ వున్నాడు. వీటితో పాటు ‘అంటే సుందరానికి ‘ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. జెర్సీ కాంబినేషన్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేలా వుంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నాని కోసం ఒక కథ సిద్ధం చేశాడట. అది కూడా ఒక సైనికుడి జీవితం ఆధారంగా ఉంటుందంట. ఇదే నిజమైతే ఇక జెర్సీ రికార్డులు తిరగరాసినట్టే. నిజ జీవిత రియల్ హీరో పాత్రలో నాని కనపడనున్నాడు. యుద్ధంలో కాళ్లు కోల్పోయిన సైనికుడి జీవితం ఆధారంగా తెరకెక్కనుందట. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్ భారీగా రూపొందిస్తున్నారని తెలుగు సిని వర్గాల సమాచారం.