
ప్రపంచాన్ని వణికించిన కరోనా మన దేశం లో తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినదాని ప్రకారం, దేశంలో కొత్త కరోనా కేసులు భారీగా తగ్గాయని, నిన్న దేశవ్యాప్తంగా 31,443 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, 118 రోజుల వరకు రోజు వారి కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రకటించింది.
రికవరీ రేటు 97.28 శాతంగా ఉందని తెలిపింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ వున్న కేసులు 4,31,315గా ఉన్నాయని, 109 రోజులలో యాక్టివ్ కేసులు కనిష్ఠానికి చేరాయని వివరించింది. దేశంవ్యాప్తంగా నిన్నటి వరకు మొత్తం 43,40,58,138 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,40,325 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.