
భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 44,230 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది . వైరస్ బారిన పడి మరో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,360 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 45,60,33,754 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 51,83,180 డోసులు అందించినట్లు తెలిపింది. మొత్తం కేసులు.. 3,15,72,344, మొత్తం మరణాలు.. 4,23,217, కోలుకున్నవారు.. 3,07,43,972, యాక్టివ్ కేసులు.. 4,05,155గా నమోదైనట్లు వెల్లడించారు.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 78,784 పరీక్షలు నిర్వహించగా.. 2,107 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,62,049 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ వల్ల గురువరాం 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో తాజాగా 623 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,43,716కు చేరింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,796కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 746 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,30,732కి చేరింది. రికవరీ రేటు 97.98 శాతంగా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,188 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.