
కామెడీ హారర్ సినిమాలతో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్. ఆయన నటిస్తున్న తాజా మూవీ.. ‘దుర్గ’. ఈ సినిమాకు సంబంధించిన హీరో రాఘవేంద్ర లారెన్స్ ఫస్ట్ లుక్.. శనివారం విడుదలైంది. ‘ముని’ సిరీస్ లో వచ్చిన హారర్ సినిమాల్లాగే.. ఈ సినిమాలోనూ ఆయన గెటప్ భయపెట్టేలా ఉంది. తెల్లగడ్డంతో, ముడుతలు పడ్డ ముఖంతో.. ఓ వృద్ధుడిలా ఉన్న గెటప్.. చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఉంది. అలాగే మరో కుర్ర గెటప్ కూడా ఈ సినిమాలో ఉంది. ఆ గెటప్ కూడా పూర్తి డిఫరెంట్ గానే ఉంది. ఇంతకుముందు లారెన్స్ నటించిన హారర్ సినిమాలు ‘కాంచన’, ‘గంగ’, ‘శివ లింగ’ తరహాలోనే ఇది కూడా విభిన్నంగా ఉంటుందని పోస్టర్ తో తెలిపారు. ఈ మూవీని లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తుండగా త్వరలో దర్శకుడు, ఇతర నటీ నటులను వెల్లడించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం లారెన్స్.. యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రాన్’ సినిమాతో పాటు ‘అధికారం’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు.
#Durga !!!
Need all your blessings ?? pic.twitter.com/pVYNepkgFM
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021