
జాతీయ ఎస్సీ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, దళితులకు రూ. 10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి తెలంగాణ దళిత బంధు పథకం అని పేరు ఖరారు చేసిన విషయం తెలిసిందే. కాగా దళిత బంధు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్సీ కమిషన్ లో ఓ పిటిషన్ దాఖలైంది.
దళిత పదం స్థానంలో అంబేడ్కర్ పదం చేర్చాలంటూ పిటిషనర్ కోరాడు. విచారణ చేపట్టిన కమిషన్ దీనిపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి గురువారం నోటీసులు ఇచ్చింది.