
తెలంగాణ లో ఏమో దళితుల కోసం సీఎం కెసిఆర్ దళిత బంధు పెడితే వేరే రాష్ట్రాల్లో సినీ నటులు వారికీ తగిన గౌరవం ఇవ్వట్లేదు. #దళితులను ఉద్దేశించిన సినీ హీరోయిన్ మీరా మిథున్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్లే తనకు మంచి అవకాశాలు రావడం లేదని… వీరిని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతులు బాగుండవని… అనేక నేరాలతో కూడా వారికి సంబంధాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మీరాపై పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయడంతో… ఆమెపై కేసులు నమోదయ్యాయి. మీరా మిథున్ కు వివాదాలు కొత్తేమీ కాదు. పలువురు స్టార్స్ ని టార్గెట్ చేస్తూ, ఆమె చేసిన కామెంట్స్ గతంలో వివాదాస్పదమయ్యాయి. తాజాగా దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లోకి నెట్టేశాయి.