
ఏపీలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేటు సాంకేతిక కారణాల వల్ల ఊడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొత్త గేటు అమర్చే పరిస్థితులు లేకపోవడంతో గురువారం నుంచి నీరు వృథాగా పోతోంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు జలయజ్ఞం పేరుతో వైఎస్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నేడు దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ప్రాజెక్టు గేటు ఊడిపడిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులిచింతల గేటు ఊడిపడ్డ కారణంగా నీరు వృథాగా పోతోందని, లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందని విమర్శించారు. ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఫొటోతో పాటు ‘దరిద్రపాదం’ అని రాసి ఉన్న చిన్న పోస్టర్ లో ఓ వ్యక్తి ముఖం కనబడకుండా రెండు కాళ్లు మాత్రమే కనిపించేలా పాదయాత్ర చేస్తున్న ఓ ఫొటో ఉండటం గమనార్హం.
జలయజ్ఞం పేరుతో మహా''మేత''…
దరిద్ర పాదం ఎఫెక్ట్ తో ఊడిపడిన గేటు…
సముద్రంపాలవుతున్న లక్షల క్యూసెక్కుల జలాలు…
తండ్రి హయాంలో జరిగిన అవినీతి తనయుడి హయాంలో బయటపడటమే దేవుడి స్క్రిప్ట్. pic.twitter.com/KZLQxqIkaH— Lokesh Nara (@naralokesh) August 6, 2021