
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. విమర్శల జోరు పెంచారు. దమ్ముంటే హుజూరాబాద్ లో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘‘హుజురాబాద్ లో పోటీ చేద్దాం. కేసీఆర్, హరీశ్.. వస్తారా? దమ్ముంటే నాతో పోటీకి రండి. నిజాయితీగా ఓట్లు వేయించుకోండి. ప్రలోభాలు, దావతులు ఆపండి…’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో నియోజకవర్గంలో పోలీస్, ఇంటెలిజెన్స్ సిబ్బందిని దింపారని, తన మనుషులను భయపెడుతున్నారని ఈటల ఆరోపించారు.
అడ్డదారులు వదిలి.. తనపై న్యాయంగా గెలిచేందుకు ప్రయత్నిస్తే మంచిదని హితవు పలికారు. మీరు అందరూ కలిసి వచ్చినా.. కనీసం తన డిపాజిట్ ను కూడా టచ్ చేయలేరు అని ఈటల వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కి హుజూరాబాద్ దళితుల మీద ప్రేమ లేదని, వారి ఓట్ల మీద మాత్రమే ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల మాటలు, చేతల్లో నిజాయితీ లేదన్నారు.