
ఏరా రాము ఏమైంది అలా ఉన్నావ్.
ఏమి లేదు రా పన్ను నొప్పిగా ఉంది.
మరి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి చూపించుకోకపోయావా ?
ఆమ్మో ఒద్దు బాబోయ్.. నా పన్నుని పీకేస్తాడు డాక్టర్.
ఉప్పు, లవంగం పెట్టుకుంటే అదే తగ్గిపోతుంది లేరా
ఇది సహజంగా ఉండే లోకం పోకడ… దంత వైద్యుడు అంటే కేవలం పన్ను తీస్తాడు అనే భ్రమలో ఉన్నారు. కానీ అది ఒకప్పటి మాట. కాలం మారింది, దంత వైద్యుల ఆలోచన ధోరణి మారింది. ఆధునిక పరికరాలు రాకతో దంత వైద్యం లో కూడా అనేక మార్పులు వచ్చాయి. దంత వైద్యం లో కూడా పిజి, పిహెచ్ డి చేసే స్థాయికి చేరింది..
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దంత వైద్యం లో 9 శాఖలు ఉన్నాయి, అవి
1. ఓరల్ మెడిసిన్ & రేడియాలజీ
2. పెరియోడాంటిక్స్
3. ఓరల్ & మాక్సీలో ఫేషియల్ సర్జన్
4. ఎండో డాంటిక్స్
5. ప్రోస్టాడాంటిక్స్
6. ఆర్థోడోంటిక్ష్
7. పీడో డాంటిక్స్
8. ఓరల్ పాథాలజీ
9. కమ్యూనిటీ డెంటిస్ట్రీ
వీటి ద్వారా నోటి క్యాన్సర్, చిగురు, దవడ, పళ్ళు, నోటి పూతలు, వంకర పళ్ళు, ఎత్తు పళ్ళు, పిల్లలకు సంబంధించిన పాల పళ్ళు, పిప్పి పళ్ళు లాంటి ఆయా సమస్యలు పరిష్కరించబడతాయి.
అత్యాధునిక మార్పులతో, అత్యాధునిక వైద్య పరికరాల తో దంత వైద్యం ప్రాధాన్యత సంతరించుకుంది.
కానీ సమాజంలో దంత వైద్యం, దంత వైద్యుల పట్ల సరైన అవగాహన లేక ఇలాంటి సమస్యల వల్ల వచ్చే బాధలు అనుభవిస్తున్నారు. శారీరక శ్రమకు తగిన ఆహారం ఎంత ముఖ్యమైనదో, మనం తీసుకునే ఆహారంలో పౌష్టిక విలువలు శరీరానికి అందించడంలో దంతాలు తోడ్పడుతాయి. మన శరీరంలో ఆహారం 50 శాతానికి పైగా నోటి నుండి ఆరగించి, సత్వరంగా పౌష్టిక విలువలను శరీరానికి అందిస్తాయి