
తెలంగాణ లో వున్న రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకు గుడ్ న్యూస్. తెలంగాణలో భూముల విలువలు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు, అపార్ట్ మెంట్లు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ను 50 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏ రోజు నుంచి అమలు చేస్తారనే దానిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సగటున వ్యవసాయేతర భూములు, ఇళ్ల విలువ 25 నుంచి 50 శాతం వరకు పెరిగింది. వ్యవసాయేతర భూముల విలువ చాలా తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో డబల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ప్రాంతాల వారీగా అపార్ట్ మెంట్లలో ప్లాట్లు విలువ ను 20 నుంచి 50 శాతం వరకు అధికారులు పెంచారు. కొన్ని ప్రాంతాల్లో ఇది 80 శాతం గా ఉంది. పురపాలక సంఘాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సగటున పెరుగుదల 33 శాతంగా ఉంది. గ్రేటర్ పరిధిలో అపార్ట్ మెంట్ ప్లాట్లు, వాటి విలువ సగటున 20 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం వరకు పెరిగింది. కొన్ని మండల కేంద్రాల్లో వీటి విలువ సగటున 50 శాతంగా ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ పెంపు ప్రతిపాదనలు సమగ్రంగా పరిశీలిస్తోంది. ఇళ్ల స్థలాల భూమి చదరపు గజం విలువ రూ. 300 ఉండగా, తాజాగా దీన్ని 500 కు పెంచారు. ఇళ్లకు సంబంధించి చదరపు అడుగు రూ.900 ఉండగా, రూ.1200 గా నిర్ణయించారు. పరిగి పురపాలక సంఘంలో గతంలో గరిష్ట చదరపు గజం భూమి విలువ రూ.7000 కాగా దీన్ని రూ9250గా పెంచారు. రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు అత్యధిక రాబడిని తెచ్చే రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల వారీగా వ్యవసాయేతర భూము ల విలువ ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు మొత్తం ఆరు శాతం ఉన్నాయి. ఇందులో స్టాంపు డ్యూటీ 4 శాతం కాగా ట్రాన్స్ ఫర్ డ్యూటీ 1 శాతంగా రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉంది. తాజాగా స్టాంపు డ్యూటీ ని 5 శాతా నికి పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలు 7 శాతానికి పెరుగుతాయి. ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆ శాఖ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు.