
నాచురల్ స్టార్ నాని మొదటి నుండి వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొదటి సినిమా నుండి సినిమా సినిమా కి ఎక్కువ గ్యాప్ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాడు. వరుస సినిమాలతో ఎప్పుడు బిజీ గా వుండే హీరో నాని. ప్రస్తుతం షూటింగ్ దశలో టక్ జగదీష్, సింగయరా ఇంకో రెండు సినిమాలు వున్నాయి. నానికి కథ నచ్చాలే గాని కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ అవకాలు ఇస్తుంటాడు. తాజాగా నాని ఓ కొత్త యువ దర్శకుడు శ్రీకాంత్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ యువ దర్శకుడు నాని కి ఒక కథని వినిపించినట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందట. హీరో తెలంగాణ ప్రాంత యువకుడిగా కనిపిస్తాడట. నాని కి ఇలాంటి తరహా పాత్ర రావడం ఇదే మొదటిసారి కావడంతో, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడతాడు. అందువలన నాని తెలంగాణ యాసపై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని చెబుతున్నారు. నాని తెలంగాణ యాసలోదుమ్మురేపాడానికి రెడీ అవుతున్నాడు.